Jul 12,2023 11:58

తిరుపతి : ఆంజనేయ స్వామి గుడిలో చోరీ జరిగిన ఘటన బుధవారం వెలుగుచూసింది. తిరుపతి చెర్లోపల్లి సర్కిల్‌ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో రూ.40 నుండి రూ.50 వేల వరకు చోరీ జరిగినట్లు ఆలయ ధర్మకర్త రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆలయ కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగ... గుడిలోని రెండు బీరువాలతో పాటు రెండు హుండీలను ధ్వంసం చేశాడు. సీసీ కెమెరాలను తొలగించి హార్డ్‌ డిస్క్‌ ను తీసుకెళ్లిపోయాడు. సంఘటన స్థలానికి క్లూస్‌ టీం చేరుకొని ఫింగర్‌ ప్రింట్‌ ను తీసుకుంది. ఘటనా స్థలానికి అధికారులు చేరుకొని ఆధారాలను సేకరించారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.