
హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. 'ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి' అని రాసి ఉన్న పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. మానుషి చిల్లర్ తెలుగులో తొలిగా నటించనున్నారు. ఈ సినిమాలో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించింది. కీలక పాత్రలో నవదీప్ నటించినట్లుగా సమాచారం. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలు.