
ప్రజాశక్తి - ఆలమూరు:గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పౌష్టికాహార పంపిణీలో అంగన్వాడిలు అందిస్తున్న సేవలు ఎనలేనివని వైసిపి సీనియర్ నేతలు పడమటి రాంబాబు, యు.సుందర విజయం, ఉండ్రాజపు చిన్నా అన్నారు. మండలంలోని మడికి సచివాలయ పరిధిలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సంపూర్ణ పౌష్టికాహార కిట్లను ప్రదర్శించగా వారు క్షుణ్ణంగా పరిశీలించి సంతఅప్తిని వ్యక్తం చేసి, లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల్లో అంగన్వాడీలు చేస్తున్న సేవలను వారు అభినందించారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారుల విషయంలో వారు మంచి శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. గర్భిణీలపై మరింత శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క శిశువును నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. వఅద్ధులు చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఉండ్రాజపు అబ్బులు, ఉండ్రాజపు యోహాను, కార్యదర్శి మోక్షంజలి, సూపర్వైజర్ వరలక్ష్మి, అంగన్వాడీలు మేరీ, తదితరులు పాల్గొన్నారు.