ప్రజాశక్తి - ఆలమూరు :ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజారోగ్య పథకాల్లో వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడిలు సంయుక్తంగా అందిస్తున్న నిరంతర సేవలు అభినందనీయమని వైద్యాధికారులు డాక్టర్ సువర్చల, డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ షమీ ఉన్నీసా, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రీలక్ష్మి కొనియాడారు. మండలంలోని మూలస్థానంలో ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కోసం అంగన్వాడీలు ఉత్తమ పౌష్టికాహార ప్రదర్శనను గురువారం వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు చిన్నారుల విషయంలో వారు మంచి శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. గర్భిణీలపై మరింత శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క శిశువును నష్టపోకుండా ప్రత్యేకమైన దఅష్టి సారిస్తు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. వృద్ధులు చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు. ఏమైనా క్లిష్టమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం వారి పర్యవేక్షణలో సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి రాజకుమార్, డిటి జానకి రామయ్య, కార్యదర్శి పి.రాజు, సూపర్వైజర్లు శివప్రసాద్, వరలక్ష్మి, విఆర్వో కుమార్, అంగన్వాడీలు నాగమణి, కుమారి, ధనలక్ష్మి, కమల, నాగరత్నం, భాను సుద్దేశ్వరి, ఆదిలక్ష్మి, జానకిరత్నం, తదితరులు పాల్గొన్నారు.










