ప్రజాశక్తి - మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు మాట్లాడుతూ ... రాష్ట్రంలో అమలవుతున్న సైకో రాజ్యాంగం పోవాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు కావాలని, సైకిల్ అధికారంలోకి రావాలని నినాదాలు చేశారు. దీక్ష కార్యక్రమంలో మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన టిడిపి నాయకులు, మాజీ సర్పంచ్ పిల్లా తాతాలు, మాజీ ఎంపీటీసీ పసలపూడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, షేక్ సల్మాన్ తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు.










