కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ఎంపిడిఓకి ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

ప్రజాశక్తి - పెనుమంట్ర : ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని మండల ప్రెసిడెంట్ ఎం గోపాలకఅష్ణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనంతో పాటు , మ్యాన్ డేస్ టార్గెట్ విధాన రద్దుచేసి, అందరికీ ఎఫ్ టీ ఈ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎంపిడిఓ వి పూర్ణ బాబ్జి కి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలకఅష్ణమూర్తి మాట్లాడుతూ సీనియర్ మేట్ , ఫీల్డ్ అసిస్టెంట్లు అనే తారతమ్యం లేకుండా అందరికీ ఫీల్డ్ అసిస్టెంట్ గా కొనసాగించాలన్నారు . అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అందరికి ఎఫ్ టి ఈ అమలు చేయాలని కోరారు. అర్హత , అనుభవం కలిగిన వారికి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని విలీన అయిన గ్రామపంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్లను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు క్యాష్ లెస్ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించాలని , ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ 10 లక్షల ఎక్స్ గ్రేషియా అమలు చేయాలని , మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ కే విజయలక్ష్మి , కోశాధికారి పి ఇమ్ లియం , కే సాయి కనకదుర్గ , కే విశాలాక్షి , కే సీత మహాలక్ష్మి , బి సత్యప్రియ , వి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.