హైదరాబాద్ : ప్రముఖ పరుపుల ఉత్పత్తి కంపనీ సెంచరీ మ్యాట్రెస్ కొత్తగా హైబ్రిడ్ కలెక్షన్ జెల్ లాటెక్స్ మ్యాట్రెస్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టనర్ కనెక్ట్ మీట్‌లో వీటిని శ్రీమలానీ గ్రూప్ సిఎండి పురుషోత్తమ్ మలానీ వీటిని ఆవిష్కరించారని ఆ సంస్థ తెలిపింది. వివిధ రకాల మందంతో 18 పరిమాణాలల్లో జెల్ లాటెక్స్ మ్యాట్రెస్‌ను పరిచయం చేసినట్లు పేర్కొంది. ''తాజా ఆవిష్కరణలు మా అమూల్య కస్టమర్‌లకు అసమానమైన నిద్ర అనుభవాలను అందించడంలో మా తిరుగులేని నిబద్ధతను గుర్తు చేస్తాయి.'' అని పురుషోత్తమ్ పేర్కొన్నారు. వీటి ప్రారంభ ధరను రూ.19,500గా నిర్ణయించామన్నారు.










