ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : భార్యపై అనుమానంతో భర్త ఆమెను కొట్టి గొంతునులిమి హత్య చేసిన ఘటన శనివారం చాగల్లు మండలంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు ... చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన దొంగ వెంకటేశ్వరరావు (38) తన భార్య సాయి హరిత (24) పై అనుమానంతో ఆమెను కొట్టి గొంతునులిమి హత్య చేశాడు. వీరికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు స్నేహ నాగ హర్ష (6), చిన్న కుమారుడు బాలాదిత్య (5). ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










