- చైనాలో మరో అద్భుత ఆవిష్కరణ
బీజింగ్ : సముద్రంపై గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల తొలి హై స్పీడ్ రైల్వే మార్గాన్ని చైనా ప్రారంభించింది. ఫుజియాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రధాన నగరాలు ఫుజౌ- జియామెన్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ లైన్‌ను ప్రారంభించింది. ఈ మార్గంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంట సమయం తగ్గనుంది. మొత్తంగా 277 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గం ఫుజౌలో ప్రారంభమై జియామెన్ మీదుగా వెళ్లి జాంగ్‌జౌలో ముగుస్తుంది. ఇంటెలిజెండ్ రోబోట్‌లు, పర్యావరణ అనుకూల పదార్థాలతో ఈ క్రాస్-సి బ్రిడ్జ్‌ను నిర్మించారు.