ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : తుని ఎల్‌ఐసి బ్రాంచ్ ఏజెంట్ల మూడవ జనరల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. మంగళవారం తుని పట్టణంలో మర్చంట్ అసోసియేషన్ భవనంలో ఎల్‌ఐసి ఏజెంట్‌లో నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఎల్‌ఐసి రాజమండ్రి డివిజన్ ప్రెసిడెంట్ వై. విశ్వేశ్వరరావు, స్థానిక నాయకులు కలదిండు సత్యనారాయణ రాజు, తుని బ్రాంచ్ మేనేజర్ జి .సత్యనారాయణ సమక్షంలో నూతన కమిటీని ప్రమాణస్వీకారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా పి.రాంబాబు, సలహాదారుడుగా ఎస్ .చెంచయ్య , ప్రెసిడెంట్ గా ఐ. వరప్రసాద్ ,వైస్ ప్రెసిడెంట్ గా టీ .అప్పారావు, నీలి రాంబాబు, జీవి సత్యనారాయణ, సెక్రటరీగా మైలపల్లి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా బి. రామకష్ణ, బి. శ్రీను, పి నాగభూషణం, ట్రెజరీ గా శ్రీనివాస్ గుప్తా తో పాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.










