లాహోర్ : వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) 15మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ టోర్నీలో పాల్గోనే సభ్యుల వివరాలను వెల్లడించాడు. పాక్ జట్టుకు బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇక స్టార్ పేసర్ నసీం షా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరం కాగా.. అతని స్థానంలో స్పిన్నర్ ఉస్మా మీర్ చోటు దక్కించుకున్నాడు. ఆసియాకప్‌లో గాయపడ్డ పేసర్ హ్యారీస్ రవూఫ్ ఫిట్‌నెస్ సాధించాడు.
జట్టు : బాబర్(కెప్టెన్), షాదాబ్, షఫీక్, ఫఖర్ జమాన్, రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, నవాజ్, రిజ్వాన్ (వికెట్ కీపర్), వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్. రిజర్వ్: మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్.










