Oct 17,2023 11:41

ఏలూరు : ప్రతి ఒక్కరికి సొంతింటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే వాసు బాబు అన్నారు. మంగళవారం నారాయణపురంలో 103 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలను కేటాయించి వారికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. అందరూ ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వపరంగా అందాల్సిన బిల్లులు డ్వాక్రా రుణం అందిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, పంచాయతీ, హౌసింగ్‌, సచివాలయం అధికారులు, నాయకులు ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.