ప్రజాశక్తి-కోట(చిత్తూరు) : ప్రతి తల్లి శిశువు జన్మించినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలని అంగన్వాడి సూపర్వైజర్ ఐ.కృష్ణమ్మ తెలియజేశారు. బుధవారం అంగన్వాడి సిడిపిఓ మునికుమారి ఆధ్వర్యంలో కోట మండలంలోని కోట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఎస్‌ఎల్‌జి కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునికుమారి మాట్లాడుతూ.. తల్లి పాలపై ప్రతిఒక్కరూ అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు. తల్లి పాలు యొక్క విశిష్టతను వివరించి, పలు రకాల ఉపయోగాలను తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు టి.పెంచలమ్మ, పి.లక్ష్మి, జి.మస్తానమ్మ, ఏఎన్‌ఎమ్, ఎల్‌హెచ్‌పిలు పాల్గొన్నారు.










