ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ప్రభుత్వ విప్, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. జల జీవన్ మిషన్‌లో భాగంగా మండలంలోని చెముడులంక శివారు గాంధీనరంలో రూ. 37.7 లక్షలతో 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఆర్సిసి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది అన్నారు. ఇందులో రక్షిత తాగునీరు కోసం జలజీవన్ మిషన్ పేరిట పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారన్నారు. గ్రామంలో ఈ ట్యాంక్ ద్వారా 890 కనెక్షన్లు ద్వారా రక్షిత మంచినీరు అందుతుందన్నారు. ప్రతి కనెక్షన్ కు 390 రూపాయలు కట్టాల్సి ఉంటుందన్నారు. గ్రామస్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, ఏఎంసి చైర్మన్ వై.నాగేశ్వరరావు, సర్పంచ్ గుణ్ణం రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ డివిఎల్ నరసింహారావు, ఏఈ పి.పద్మ, నేతలు దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, దొండపాటి చంటి, అడబాల వెంకట్రావు, బి.వీరవెంకట్రావు, దొండపాటి శ్రీను, దొండపాటి వెంకటేశ్వరరావు, పామర్తి పేర్రాజు, తమ్మన హరి, అడబాల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.










