ఎర్రగుంట్ల : పట్టణ పరిధిలోని రాణి వనం -1 సచివాలయాన్ని మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, కమిషనర్ పగడాల జగన్నాథ్ గురువారం తనిఖీ చేశారు.సచివాలయ సిబ్బంది హాజరు రికార్డును పరిశీలించారు. సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు గురించి అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిపై ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన చర్యలు తప్పవని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 20 వార్డు కౌన్సిలర్ అలీ, ఒకటవ వార్డు ఇన్చార్జి ప్రశాంత్, మున్సిపల్ ఆర్వో గంగిరెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










