Oct 08,2023 09:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : దక్షిణాఫ్రికాలో జరిగిన ఐదవ ప్రపంచ కప్‌ టెన్ని కాయిట్‌ గర్ల్స్‌ డబుల్‌లో ఇండియా తరఫున ఆడిన ఆంధ్రప్రదేశ్‌ చెందిన హేమా మాధురి, ఆర్‌.మౌనిక మూడోస్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. మెడల్‌ సాధించిన ఇద్దరు క్రీడాకారిణిల్లో విజయనగరం కెఎల్‌ పురానకి చెందిన రెడ్డి మౌనిక డబుల్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. విజయనగరం ఖ్యాతిని మరో సారి ప్రపంచ స్థాయిలో మౌనిక చాటి చెప్పింది.