Oct 03,2023 09:21

ప్రజాశక్తి-విజయనగరం కోట : చంద్రబాబు అక్రమ రిమాండ్‌ను నిరసిస్తూ ... న్యాయం జరగాలని కోరుకుంటూ మంగళవారం ఉదయం విజయనగరం నియోజకవర్గం యువత విజయనగరం నుంచి సింహాచలం దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోరాడ వెంకట్రావు, గంటా రవి, పడాల జోగేష్‌, మాతా బుజ్జి, తెలుగుదేశం నాయకులు పాదయాత్ర ప్రారంభించారు.