Sep 18,2023 09:21

సాటి లేని మేటి తె(వె)లుగు
వెన్నెల్లా చల్లదనం
తెలుగు భాష చక్కదనం
నలుదిశలా చాటాలోయ్
మాతృభాష గొప్పతనం

మల్లెల్లా తెల్లదనం
తెలుగు భాష మూలధనం
'దేశభాషలందు లెస్స'
పరిమళించు పూలవనం
తెలుగు వెలుగు అసమానం
తెలుగోళ్ళకు బహుమానం

సాటి లేని మేటి భాష
లేదు కదా కొలమానం
పద పదమున తీయదనం
తెలుగు భాష ఘనం ఘనం
పరిరక్షణ చేయాలోయ్ !
మనమంతా దినం దినం

- గద్వాల సోమన్న
99664 14580