Oct 24,2023 08:00

అమరావతి : అంతర్జాతీయ వేదికపై తెలుగు కుర్రాడు, విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ మరోసారి సత్తాచాటారు. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో అన్మిష్‌కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. దీంతో ఓ అరుదైన ఘనతను అన్మిష్‌ సొంతం చేసుకున్నారు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో అన్మిష్‌ వర్మ గోల్డ్‌మెడల్‌ను సాధించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప పోటీల్లో భారత్‌ తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్‌ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌ లో హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అన్మిష్‌ రికార్డులకెక్కారు. అంతకుముందు 2018లో గ్రీస్‌ వేదికగా జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్న అన్మిష్‌.. 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్‌లోనూ బంగారు పతకంతో మెరిశారు.