అహ్మదాబాద్ : క్రీడాభిమానుల్లో ఉత్కంఠ రేపుతోన్న వన్డే ప్రపంచకప్‌లో అత్యంత హైఓల్టేజీ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. ప్రపంచంలోని అతి పెద్ద మైదానాల్లో ఒకటైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడి స్టేడియం వేదికగా భారత్ - పాకిస్థాన్ జట్లు బరిలో దిగనున్నాయి. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్‌కు సై అంది. పాక్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల తర్వాత భారత్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు అడుగుపెట్టింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా.. పాకిస్తాన్ చేతిలో ఓడిన దాఖలాలు లేవు. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా.. అన్నిట్లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. అదే రికార్డును ఇక్కడా కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.










