- శ్రీలంకపై 41పరుగులతో గెలుపు
- 10వేల పరుగుల క్లబ్‌లో రోహిత్
- కుల్దీప్‌కు నాలుగు వికెట్లు
కొలంబో : ఆసియా కప్ ఫైనల్లోకి టీమిం డియా దూసుకెళ్లింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారతజట్టు 41పరుగుల తేడాతో ఘన విజయం సాధించిం ది. దీంతో వరుసగా రెండు విజయాలతో భారతజట్టు 4పాయింట్ల (+2.69 రన్‌రేట్)తో ఫైనల్‌కు చేరింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు 49.1 ఓవర్లలో 213పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టు 41.3ఓవర్లలో 172పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై కుల్దీప్(4/43) మరోసారి మెరిసాడు. జడేజా(2/33), బుమ్రా (2/30) టీమిండి యా గెలుపులో కీలకపాత్ర పోషించారు.
టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ(53) శుభ్‌మన్ గిల్(19) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్(39), ఇషాన్ కిషన్(33) ఫర్వాలేదనిపించారు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే(5/40), చరిత అసలంక(4/18) మెలికలు తిరగే స్పిన్‌కు భారత బ్యాటర్స్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఒకానొక దశలో టీమిండియా స్కోర్ 200 పరుగులైనా దాటుతుందా? అనే సందేహం కలిగింది. చివర్లో అక్షర్ పటేల్(26) మహమ్మద్ సిరాజ్(5 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు విలువైన 26 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రద స్కోర్‌కు చేరింది. 49వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడిన అక్షర్ పటేల్ బౌండరీ వద్ద సమరవిక్రమ చేతికి చిక్కాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వెల్లలాగే రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
ఛేదనలో శ్రీలంక ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోయింది. 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. ఆ దశలో ధనుంజయ(41), వెల్లలగే(42నాటౌట్) క్రీజ్‌లో ఉండగా శ్రీలంక సునా యాసంగా మ్యాచ్‌ను గెలిచే కనిపించింది. ఈ క్రమం లో ధనుంజయ వికెట్‌ను 162పరుగుల వద్ద కోల్పో యిన శ్రీలంక మరో 10 పరుగుల వ్యత్యాసంలో మిగి లిన వికెట్లను కోల్పోయింది. చివరి రెండు వికెట్లను కూల్చి కుల్దీప్ టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషి ంచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు...
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ (బి)వెల్లలగె 53, శుభ్‌మన్ (బి)వెల్లలగె 19, కోహ్లి (సి)శనక (బి)వెల్లలగె 3, ఇషాన్ (సి) వెల్లలగె (బి)అసలంక 33, కేఎల్ రాహుల్ (సి అండ్ బి) వెల్లలగె 39, హార్దిక్ (సి)కుశాల్ (బి)వెల్లలగె 5, జడేజా (సి)కుశాల్ (బి)అసలంక 4, అక్షర్ (సి)సమరవిక్రమ (బి)తీక్షణ 26, బుమ్రా (బి)అసలంక 5, కుల్దీప్ (సి)ధనుంజయ (బి)అసలంక 0, సిరాజ్ (నాటౌట్) 5, అదనం 19. (49.1ఓవర్లలో ఆలౌట్) 213పరుగులు. వికెట్ల పతనం: 1/80, 2/90, 3/91, 4/151, 5/170, 6/172, 7/178, 8/186, 9/186, 10/213 బౌలింగ్: రజిత 4-0-30-0, తీక్షణ 8-0-29-0, శనక 3-0-24-0, పథీరన 3-0-27-0, వెల్లలగె 10-1-40-5, ధనుంజ య 10-0-28-0, అసలంక 9-1-18-4.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిస్సంక (సి)రాహుల్ (బి)బుమ్రా 6, కరుణరత్నే (సి)శుభ్‌మన్ (బి)సిరాజ్ 2, కుశాల్ మెండీస్ (సి)సూర్యకుమార్ (బి)బుమ్రా 15, సమరవిక్రమ (స్టంప్)రాహుల్ (బి)కుల్దీప్ 17, అసలంక (సి)రాహుల్ (బి)కుల్దీప్ 22, ధనుంజయ (సి)శుభ్‌మన్ (బి)జడేజా 41, శనక (సి)రోహిత్ (బి)జడేజా 9, వెల్లలగె (నాటౌట్) 42, తీక్షణ (సి)సూర్యకుమార్ (బి)హార్దిక్ 2, రజిత (బి)కుల్దీప్ 1, పథీరణ (బి)కుల్దీప్ 0, అదనం 15. వికెట్ల పతనం: 1/7, 2/25, 3/25, 4/68, 5/73, 6/99, 7/162, 8/171, 9/172, 10/172 బౌలింగ్: బుమ్రా 7-1-30-2, సిరాజ్ 5-2-17-1, హార్దిక్ 5-0-14-1, కుల్దీప్ 9.3-0-43-4, జడేజా 10-0-33-2, అక్షర్ 5-0-29-0










