Oct 13,2023 17:11

పారిస్‌ : పారిస్‌లోని ఉత్తర ఫ్రాన్స్‌ నగరమైన అరాస్‌లోని ఓ స్కూల్లో టీచర్‌పై శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో టీచర్‌ మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు బిఎఫ్‌ఎం టీవీ వెల్లడించింది. టీచర్‌పై దాడికి పాల్పడింది ఆ స్కూల్‌ పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థితోపాటు అతని సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ దాడిలో ఫ్రెంచ్‌ భాషను బోధించే టీచర్‌ మృతి చెందారు. స్పోర్ట్స్‌ టీచర్‌కి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై ఫ్రెంచ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్‌ స్పందించారు. ఈ ఘటనపై పోలీసుల ఆపరేషన్‌ జరుగుతోందని ఆయన తెలిపారు.