
తమిళనాడు : తమిళనాడు సిపిఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య (102) బుధవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం జ్వరం లక్షణాలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. చెన్నై క్రోంపేట లోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం ప్రజల సందర్శనార్ధం టి.నగర్‌లోని పార్టీ ఆఫీసుకు తరలించారు.