చెన్నై : శ్రీలంక అరెస్టు చేసిన 27 మంది భారత జాలర్ల విడుదలకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. జాలర్ల పడవల విడుదలకు కూడా సహాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు స్టాలిన్ లేఖ రాసారు. తమిళ జాలర్లను శ్రీలంక అరెస్టు చేయడం, నిర్భంధించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు తమిళనాడు తీరం వెంబడి ఉన్న జాలర్లలో భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. వీరి ఏకైక జీవనోపాధి ప్రమాదంలో పడిందని తెలిపారు. నిర్బంధంలో ఉన్న జాలర్ల విడుదలకు శ్రీలంక ప్రభుత్వంతో తక్షణమే దౌత్యపరమైన చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ నెల 14న రెండు వేర్వేరు ఘటనల్లో తమిళనాడుకు చెందిన మొత్తం 27 మంది జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడంతోపాటు వారి నాలుగు బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది.










