
పట్టించుకోని ప్రభుత్వం, బైజూస్ సంస్థ
రెండు జిల్లాల్లో 32 వేలకఁపైగా విద్యార్థులకఁ ట్యాబ్‌లు అందజేత
ఏడాది గడవక ముందే 30 శాతానికిపైగా ట్యాబ్‌లు మూలకు
ఛార్జింగ్ ఎక్కకపోవడం వంటి పలు సమస్యలతో పక్కకు
యూట్యూబ్, వీడియో గేమ్స్ అప్‌లోడ్‌తో లక్ష్యానికి తూట్లు
ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకఁ సాంకేతికంగా విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్యాబ్‌ల విద్య ఏడాది గడవక ముందే అటకెక్కింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ట్యాబ్‌ల విద్య అగమ్యగోచరంగా మారింది. దీంతో ఉపాధ్యాయులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గతేడాది డిసెంబర్ 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులందరికీ బైజూస్ సంస్థకు సంబంధించిన ట్యాబ్‌లను ప్రభుత్వం అందించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 14,353 మంది విద్యార్థులకఁ, ఏలూరు జిల్లాలో దాదాపు 18 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లను అందించారు. నిబంధనల ప్రకారం ఈ ట్యాబ్‌లు అందుకఁన్న విద్యార్థులు ఎఁమిది, తొమ్మిది, పదో తరగతి వరకూ విఁయోగించుకోవాల్సి ఉంది. ఆయా తరగతులకు సంబంధించిన పాఠాల కంటెంట్‌ను బైజూస్ సంస్థ అందులో ఏర్పాటు చేసింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి భాషా పాఠాలు తప్ప లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ పాఠ్యాంశాలకు సంబంధించిన కంటెంట్‌ను దీఁలో పొందుపర్చారు. తొలుత నాలుగైదు నెలలు అంతా సవ్యంగానే సాగింది. విద్యార్థులు ట్యాబ్‌లో ఏయే పాఠాలు వింటున్నారు.. ఏయే పాఠాలు వినడం లేదో పైస్థాయిలో పర్యవేక్షణ ఉండేది. బైజూస్ సంస్థ ఆర్థికంగా దెబ్బతిఁ మార్కెట్లో చతికలబడటం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ట్యాబ్‌ల విద్య పూర్తిగా పక్కకఁపోయింది.
30 శాతం ట్యాబ్‌లు మూలకఁ పలు ట్యాబ్‌ల్లో యూట్యూబ్, ఫ్రీ ఫైర్ గేమ్స్
రెండు జిల్లాల్లో విద్యార్థులకఁ ఇచ్చిన బైజూస్ ట్యాబ్‌లో 30 శాతం వరకూ పఁ చేయడం లేదఁ చెబుతున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ ఁలబడకపోవడం, లాగిన్ అఁ అడగడం వంటి సమస్యలు ఉన్నట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ట్యాబ్ రిపేర్ వస్తే తిరిగి బాగుచేసే వ్యవస్థ లేకఁండాపోయింది. చిన్నచిన్న సమస్యలైతే సచివాయాల్లో పఁచేసే డిజిటల్ అసిస్టెంట్లు చూస్తున్నారు. మూడేళ్లపాటు ఉపయోగపడాల్సిన ట్యాబ్ నాలుగైదు నెలలకే మూలనపడిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు మళ్లీ పాత పద్దతిలోనే విద్య అభ్యసించాల్సి వస్తోంది. తరగతిలో కొంతమంది ట్యాబ్ ఉపయోగించడం, మరికొంతమందికి ట్యాబ్‌లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొత్తగా ఎఁమిదో తరగతిలో చేరిన విద్యార్థులకఁ ట్యాబ్‌లు ఎప్పటికిస్తారో తెలియఁ పరిస్థితి నెలకొంది. అంతేకాకఁండా బైజూస్ సంస్థ అందించిన ట్యాబ్‌లో పాఠాలకఁ సంబంధించిన కంటెంట్ తప్ప వేరే ఏవీ ఓపెన్ కావఁ అప్పట్లో అధికారులు తెలిపారు. అయితే బైజూస్ ట్యాబ్‌ల్లో యూట్యూబ్, గేమ్స్ వంటివి అప్‌లోడ్ చేసుకోవడం ఎలా అనే వీడియోలు యూట్యూబ్‌లో వచ్చేశాయి. దీంతో విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి ట్యాబ్‌ల్లో యూట్యూబ్, ఫ్రీపైర్ గేమ్స్ వంటివి అప్‌లోడ్ చేసుకోవడంతో అసలుకే మోసం వచ్చిందఁ ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనకఁ గురవుతున్నారు. పైస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందఁ తెలుస్తోంది. పైనుంచి పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు ట్యాబ్‌ను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో ఈపాటికి ప్రభుత్వాఁకి తెలిసి ఉండేది. పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ట్యాబ్‌ల విద్య పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్భాటంగా ట్యాబ్‌లను పంపిణీ చేసిన ప్రభుత్వం, తర్వాత గాలికి వదిలేయడంతో హైస్కూల్ విద్యకఁ తీవ్ర విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. బైజూస్ సంస్థకఁ లాభాలు రావడం తప్ప, విద్యార్ధులకఁ ఉపయోగపడఁ దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ట్యాబ్‌లకఁ సంబంధించి సరైన పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.