Jul 06,2023 21:37

బెంగళూరు : తమ వినియోగదారులకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని కల్పించడానికి మాన్‌సూన్‌ క్యాంపెయిన్‌ను చేపడుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) తెలిపింది. ఈ వర్షాకాలంలో 20పాయింట్ల సమగ్ర వాహన ఫిట్‌నెస్‌ తనిఖీ నుండి ఇంటి వద్దనే సేవలు అందించటం వరకూ విస్తృత శ్రేణీ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని తమ సర్వీసు సెంటర్లలో ఆకర్షణీయ సర్వీసింగ్‌ ప్యాకేజిలు అందిస్తున్నట్లు పేర్కొంది.