Sep 20,2023 12:12

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ... స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అనంతరం వివిధ వర్గాల నుండి సంతకాలు, అభిప్రాయాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. టిడిపి నాయకులు గుడాల జయబాబు, రిమ్మలపూడి దొరబాబు, చింతపల్లి రామకృష్ణ, వాసంశెట్టి శ్రీనువాసు, పర్వతిన సుబ్బారావు, అల్లూరి రామకఅష్ణ, తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ఈ నిరాహారదీక్ష చేపట్టిన నాయకులకు మండపేట నాయకులు ఉంగరాల రాంబాబు, గుండు వీరతాత రాజు, వి.ప్రసాదరావు సంఘీభావం తెలిపారు.