Oct 16,2023 08:38

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని తెలుగు తమ్ముళ్లు బైరెడ్డిపల్లి గ్రామంలోని చెక్‌ పోస్ట్‌ కుండలి వద్దకు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు అక్కడికి చేరుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు పై న్యాయానికి సంకెళ్లు పడ్డాయని టిడిపి జెండాలు చేతబట్టి మోకాళ్లపై కూర్చుని రెండు చేతులకు నల్ల బ్యాడ్జీల సంకెళ్లుగ వేసుకుని నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ చంద్రబాబు నాయుడును వెంటనే రిలీజ్‌ చేయాలి అనే నినాదాలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.