May 30,2023 15:14

ప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి): మహిళలు అన్ని రంగాలలో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా మహానాడులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టరనిమండల టిడిపి మహిళా అధ్యక్షురాలు కొమ్మక లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేసి జేజేలు పలికారు.టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా 18 నుండి 59 సం,లమహిళలకు తన ఖాతాలో నెలకు 1500,తల్లికి వందనం పేరుతో 15000,దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం,వంటి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు 2024లో జరిగే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశ పెట్టడం జరుగుతుందని అన్నారు.ఒకటవ తరగతి నుంచి బీటెక్‌ వరకు ఉచిత విద్యను అందించడం బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని కల్పించి ప్రతి ఇంటికి ఉచిత తాగునీటిని ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పథకాలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీటీసీ ఈశ్వరమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.