Nov 14,2023 12:04

ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : అధికంగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ... మంగళవారం జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ఘంటసాల ప్రధాన సెంటర్‌ నుంచి విద్యుత్‌ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన తరువాత ఏఈ రవికుమార్‌ కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికంగా పెంచిన కరెంటు చార్జీల కారణంగా సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని టిడిపి, జనసేన నాయకులు అన్నారు. ట్రూ అప్‌ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతుందని విమర్శించారు. తక్షణమే పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నేతలు పాల్గొన్నారు.