
అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివఅద్ధే ప్రధాన అజెండాగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తెదేపా నుంచి యనమల రామకఅష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌లను పార్టీలు నియమించాయి. జనసేన-తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది.