Sep 20,2023 16:44

ఐసీసీ మెన్స్‌ వరల్డ్‌కప్‌-2024 టోర్నీకి వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్‌, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్‌ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గాఫ్‌ అలార్డిస్‌ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్‌ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.