అహ్మాదాబాద్ : ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లుతున్నట్లు సన్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఇష్యూతో రూ.10.85 కోట్ల నిధుల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఐపిఒ నవంబర్ 7న ప్రారంభమై 9న ముగుస్తుందని పేర్కొంది. కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 12.91 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.84 చొప్పున జారీ చేయనున్నట్లు తెలిపింది. అప్లికేషన్ కోసం కనీస లాట్ సైజ్ 1600 షేర్లకు బిడ్ చేయాల్సి (రూ.1.34 లక్షలు) ఉంటుందని వెల్లడించింది. సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనం కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొంది.