Feb 08,2023 20:14

ప్రజాశక్తి- విజయవాడ :ప్రజాశక్తి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలక్ష్మికి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి పలిశెట్టి బాలకృష్ణ (83) వయోభారంతో బుధవారం ఉదయం మరణించారు. బాలకృష్ణకు ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. సాయిలక్ష్మి మూడవ కూమార్తె. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయవాడ జక్కంపూడి కాలనీలోని నివాస గృహం వద్ద ఉంచిన బాలకృష్ణ భౌతికకాయాన్ని ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలకృష్ణ మృతికి ఎడిటర్‌ తులసీదాస్‌, సిజిఎం అచ్యుత్‌రావు సంతాపం తెలిపారు.