ప్రజాశక్తి -సామర్లకోట రూరల్ : కేంద్ర ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేసి పేదలు, కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా మహాసభ సామర్లకోట విశ్వబ్రాహ్మణ భవనంలో శుక్రవారం సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విచ్చేసి మాట్లాడారు .ఈ సందర్భంగా ఆవుల శేఖర్ మాట్లాడుతూ సాగుభూమి, ఉపాధి పేదలకు దక్కేంతవరకు పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, మోడీ ప్రభుత్వం జాతీయఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్యానికి మందులు ఇవ్వడం లేదని మజ్జిగ గాని నీరు గాని గడ్డపారలు గానీ సరఫరా చేయడం లేదని వాపోయారు. అలాగే రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు నడ్డి విరిచే దిశగా ఎరువులపై సబ్సిడీలు ఇవ్వడం లేదని అన్నారు. భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను, సాగు భూములు పంచేవరకు భూ పోరాటాలు నిర్వహిస్తామని ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పట్టణాల్లో సెంటు భూమి గ్రామాల్లో సెంటున్నర భూమి ఇస్తున్న అది ఎందుకు పనిచేయదన్నారు. పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామాలలో ఐదు సెంట్లు భూమి పంపిణీ చేయాలని అన్నారు. ఈనెల 25, 26, 27 తేదీలలో బాపట్లలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 22వ మహాసభ నిర్వహిస్తున్నామని 25వ తేదీన సుమారు పదివేల మందితో ఊరేగింపు నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు భారీగా పాల్గని పిలుపునిచ్చారు . మధు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెనించాలని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ పెద్దిరెడ్డి సత్యనారాయణ ఎలిసెట్టి రామదాసు పప్పు ఆదినారాయణ కేసు వరపు అప్పలరాజు తదితరులు మాట్లాడారు. జిల్లా మహాసభ ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ సప్పసూరిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కేంద్ సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. మధు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెనించాలని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఎలిసెట్టి రామదాసు, పప్పు ఆదినారాయణ, కేసు వరపు అప్పలరాజు తదితరులు మాట్లాడారు .జిల్లా మహాసభ ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, సప్పసూరిబాబు, బర్ల లక్ష్మీనారాయణ ,సుఖపట్ల బాబ్జి, అల్లూరి భద్రం, సప్త సూరిబాబు ,నమ్మి సత్యనారాయణ ,విప్లవ గేయాలు తో సభను రంజింపజేశారు. ముందుగా బికేఎం యు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వ్యవసాయ కూలీలు పలువురు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు భారీగా పాల్గొన్నారు.










