Aug 08,2023 15:26

ప్రజాశక్తి - శ్రీకాకుళం : నేరాలు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్‌. రాధక పోలీసు అధికారులును ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీకాకుళం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులుతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌.పి. పెండింగ్‌ పిటిషన్లు, తీవ్రమైన (గ్రేవ్‌ కేసులు) నేరాలు, యస్‌.సి, యస్‌.టి కేసులు,పోక్సో కేసులు, మిస్సింగ్‌ కేసులు, నాన్‌ బెయిబుల్‌ వారెంట్లు అను అంశాలపైన సమీక్ష నిర్వహించి పలు ముఖ్యమైన కేసులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ.. నేరం జరిగినవెంటనే నేర స్థలానికి చేరుకొని అక్కడ నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలు ఆధారాలు సేకరించి కేసు ప్రాపర్టీ స్వాధీనంలో జాగ్రతలు తీసుకోవాలన్నారు. దర్యాప్తులో నైపుణ్యాన్ని పెంచుకొని కేసుల్లో పురోగతి సాధించాలిని సూచించారు. ఆస్తి నేరాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రేత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మిస్సింగ్‌ కేసులు త్వరితగతిన పూర్తి స్థాయిలో ఛేదించాలన్నారు. పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలని, స్టేషన్‌ పరిదిలో ఎక్కువ నేరములకు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై షీట్లు తెరవాలని, రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలన్నారు. యస్‌.సి, యస్‌.టి కేసులు, ఫోక్సో వంటి ముక్యమైనా ఆన్ని కేసులులో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సాక్ష్యాధారాలు సేకరణలో సాక్షిలును విచారణలో జాగ్రత్తలు పాటిస్తు, దర్యాప్తుని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి అని అన్నారు.నాన్‌ బెయిబుల్‌ వారెంట్లును అమలుపరిచి సదురు వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచాలని న్నారు. దర్యాప్తు పూర్తయిన ప్రతి కేసు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసిన అనంతరం సీసీటిఎన్‌లో నమోదు చేయాలని అన్నారు. సైబర్‌ మోసాలు గురించి విస్తతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ వారిచే ప్రశంసా

గతంలో చిత్తూరు ట్రాఫిక్‌ డిఎస్పీగా పనిచేసిన జిల్లా ప్రస్తుత అడ్మిన్‌ ఆడిషినల్‌ ఎస్పి జె.తిపే స్వామి, ఆత్మకూరు డిఎస్పీగా పనిచేసిన సమయంలో వై.శృతి విధి నిర్వహణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ శ్రీ కె రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంస పత్రాలను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అదనపు ఎస్పీ, డి.ఎస్‌.పి నకు అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌పిలు టిపి.విఠలేశ్వర్‌, జె.తిప్పేస్వామి, శ్రీకాకుళం టౌన్‌ డిఎస్పీ వై.శృతి, శ్రీకాకుళం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.