ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు (తిరుపతి) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భాకరాపేట ఎస్‌ఐ ప్రకాష్ కుమార్ తెలిపారు. కోడిపందాలు, జల్లికట్టు, పేకాట, బెట్టింగ్, అక్రమమద్యం, నాటుసారా, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై నిషేధం వున్నట్లు తెలిపారు. నిషేదాజ్ఞలు ఉల్లంగించిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజాజీవనానికి ఆటంకాలు కలిగించి అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని కోరారు.










