Sep 19,2023 12:09

చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ సహన్‌ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యారు. సహన్‌ అరాచ్చిగే శ్రీలంక సీనియర్‌ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడారు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉండటంతో జట్టు బాధ్యతను సెలక్టర్లు అతడికి అప్పగించారు. ఆసియాకప్‌-2023 ఫైనల్‌ శ్రీలంక జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్‌గా ఉన్నారు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గొనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో, అషెన్‌ బండార వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023కు సమయం దగ్గర పడుతుండటంతో ... ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా ... ఈ టోర్నీలో పాల్గొనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్‌ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ఆక్టోబర్‌ 8వరకు జరగనుంది.

శ్రీలంక జట్టు : లసిత్‌ క్రూస్‌పుల్లే, షెవోన్‌ డేనియల్‌, అషెన్‌ బండార, సహన్‌ అరాచ్చిగే (కెప్టెన్‌), అహన్‌ విక్రమసింఘే, లహిరు ఉదార ​​(వికెట్‌ కీపర్‌), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్‌ వియస్కాంత్‌, నిమేష్‌ నూతుస్ర విముక్తి, నిమేష్‌ నూతుస్ర విముక్తి,

 

;