Sep 13,2023 13:17

ప్రజాశక్తి-మడకశిర రూరల్‌ (అనంతపురం) : విద్యార్థులు విద్యతోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ ఉదయ భాస్కర్‌ సూచించారు. మడకశిర మండలంలోని నీలకంఠాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్‌ రెడ్డి 118వ జయంతి సందర్భంగా ... బుధవారం మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన తాలుకా స్థాయి క్రీడా పోటీలను అధికారి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలిత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రజా ప్రతినిధులు నాయకులు ఉపాధ్యాయులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... క్రీడాకారులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని గుర్తు చేశారు అదేవిధంగా క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. నీలకంఠాపురంలో ఇలాంటి టోర్నమెంట్‌ నిర్వహించడం పట్ల క్రీడాకారుల దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతగానో ద్వాదపడుతుందన్నారు. విద్యార్థులు శ్రీ రామ్‌ రెడ్డి సేవలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.