Nov 08,2023 13:24

ప్రజాశక్తి- అనంతపురం : క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడుతాయని జేఎన్టీయూ ఉప కులపతి ఆచార్య జింక రంగ జనార్ధన అన్నారు. బుధవారం స్థానిక ఓటిపిఆర్‌ఐ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రీడా సంబరాలకు రంగ జనార్థన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపగలపతి మాట్లాడుతూ ... విద్యార్థులను క్రీడలు ఎంతో ప్రభావితం చేస్తాయని వాటిని విద్యతోపాటు భాగంగా చేసుకోవాలన్నారు. అనేక కాంపిటీషన్స్‌లో ఉద్యోగాల్లో క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కూడా కల్పించడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక క్రీడను ఆడాలని సూచించారు అనంతపురం జేఎన్టీయూ ఓటిపిఆర్‌ఐ కళాశాల అభివృద్ధికి వర్సిటీ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు క్రీడాకారులతో ఉపకులపతి గౌరవ వందన స్వీకరించి శాంతికపోతాలను ఎగురవేసి క్రికెట్‌ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శశిధర్‌, ఓటిపిఆర్‌ఐ డైరెక్టర్‌ ఆచార్య దుర్గాప్రసాద్‌, ప్రిన్సిపల్‌ గోపీనాథ్‌, అసిస్టెంట్‌ రిజిస్టర్‌ ప్రభాకర్‌, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.