Oct 08,2023 16:52

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా స్పేస్‌ వాక్‌ నిర్వహించారు. ఆదివారం సూళ్లూరుపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణం నుండి డిఓఎస్‌ కాలనీ వరకు జరిగిన స్పేస్‌ వాక్‌ను షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా షార్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సైన్సు పరంగా అంతరిక్ష పరిశోదల ద్వారా మనం సాధిస్తున్న ప్రగతిని గురించి అందరికి తెలియ జేయడమే ఈ స్పేస్‌ వాక్‌ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ స్పేస్‌ వాక్‌ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని భారతమాతకు జై అంటూ ఇస్రోకు జైజై అంటూ నినాదాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ర్యాలీలో ఇస్రో అధికారులు ప్రదర్శనకు ఉంచిన రాకెట్‌ నమూనాలలొ భవిషత్‌ మానవ సహిత ప్రయోగ హెచ్‌ ఆర్‌ఎల్‌ వి రాకెట్‌ నమూనా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో షార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ గోపికృష్ణ, డబ్ల్యుఎస్‌డబ్ల్యు సూళ్లూరుపేట ప్రోగ్రాం చైర్మన్‌ సంబు ప్రసాద్‌, ఎస్‌ఎంపిసి డిప్యూటీ డైరెక్టర్‌ రమేష్‌ బాబు, సూళ్లూరుపేట తహశీల్దార్‌ రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

walk

 

2