
సంగారెడ్డి (హైదరాబాద్) : బిజెపి అందోల్ అభ్యర్థి బాబూ మోహన్ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ బిఆర్‌ఎస్‌లో చేరారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బాబూ మోహన్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉదరు బాబూ మోహన్ అందోల్ బిజెపి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఉదయ్ బాబు మోహన్‌తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బిజెపి నాయకులు పార్టీలో చేరారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సిఎం కెసిఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.