
అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ సిఐడి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఉన్నత న్యాయస్థానం ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.