Sep 16,2023 09:39
  • బంగ్లాదేశ్‌ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి
  • 17న భారత్‌ × శ్రీలంక మధ్య టైటిల్‌ పోరు

కొలంబో : నామమాత్రపు చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలైంది. సీనియర్‌ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ బెంచ్‌కే పరిమితం కావడం, బ్యాటర్లు కోహ్లి, హార్దిక్‌ విశ్రాంతి జట్టు ఫలితంపై ప్రభావం చూపాయి. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 265పరుగులు చేసింది. ఛేదనలో భారతజట్టు 49.5 ఓవర్లలో 259పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(121) సెంచరీతో కదం తొక్కినా.. మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(0), తిలక్‌వర్మ(5), ఇషాన్‌(5), జడేజా(7) సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యారు. చివర్లో అక్షర్‌(42) పోరాడినా.. విజయానికి టీమిండియా 9 బంతుల్లో 12పరుగులు కావల్సిన దశలో ఔటవ్వడం జట్టు ఫలితంపై ప్రభావం చూపింది. ముస్తాఫిజుర్‌కు మూడు, మెహిదీ, తంజుమ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కుద ఇగిన ఓ దశలో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌(80), తౌహిద్‌ హ్రిదోరు(54) రాణించారు. చివర్లో నసుమ్‌ అహ్మద్‌(44), మెహిది హసన్‌(29నాటౌట్‌) మెరిసారు. 34.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులుగా ఉన్న బంగ్లా స్కోర్‌.. ఆ తర్వాత 15.5 ఓవర్లలో ఏకంగా 104 పరుగులు జోడించి, 265 పరుగులు చేసింది. శార్దూల్‌కు మూడు, ప్రసిధ్‌ కృష్ణ, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీసారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌-అల్‌-హసేన్‌కు లభించింది.
 

స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (బి)శార్దూల్‌ 13, లింటన్‌ దాస్‌ (బి)షమీ 0, అనముల్‌ (సి)రాహుల్‌ (బి)శార్దూల్‌ 4, షకీబ్‌ (బి)శార్దూల్‌ 80, మెహిదీ హసన్‌ (సి)రోహిత్‌ (బి)అక్షర్‌ 13, తౌహిద్‌ హందారు (సి)తిలక్‌ వర్మ (బి)షమీ 54, షమీమ్‌ (ఎల్‌బి)జడేజా 1, నసుమ్‌ అహ్మద్‌ (బి)ప్రసిద్‌ 44, మెహిదీ హసన్‌ (నాటౌట్‌) 29, తంజిమ్‌ (నాటౌట్‌) 14, (అదనం 13. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 265పరుగులు. వికెట్ల పతనం: 1/13, 2/15, 3/28, 4/59, 5/160, 6/161, 7/193, 8/238 బౌలింగ్‌: షమీ 8-1-32-2, శార్దూల్‌ 10-0-65-3, ప్రసిధ్‌ 9-0-43-1, అక్షర్‌ 9-0-47-1, తిలక్‌ వర్మ 4-0-21-0, జడేజా 10-1-53-1.

ఇండియా ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (సి)అన్ముల్‌ (బి)తంజిమ్‌ 0, శుభ్‌మన్‌ (సి)తౌహిద్‌ (బి)మోహిదీ 121, తిలక్‌ వర్మ (బి)తంజుమ్‌ 5, కేఎల్‌ రాహుల్‌ (సి)షమీమ్‌ (బి)మోహిదీ 19, ఇషాన్‌ కిషన్‌ (ఎల్‌బి)మెహిదీ 5, సూర్యకుమార్‌ (బి)షకీబ్‌ 26, జడేజా (బి)ముస్తాఫిజుర్‌ 7, అక్షర్‌ పటేల్‌ (సి)తంజిద్‌ (బి)ముస్తాఫిజుర్‌ 42, శార్దూల్‌ (సి)మెహిదీ (బి)ముస్తఫిజుర్‌ 11, షమీ (రనౌట్‌) తంజిద్‌/లింటన్‌ దాస్‌) 6, ప్రసిధ్‌ కృష్ణ (నాటౌట్‌) 0. (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 259పరుగులు. వికెట్ల పతనం: 1/2, 2/17, 3/74, 4/94, 5/139. 6/170, 7/209, 8/249, 9/254, 10/259 బౌలింగ్‌: తంజిమ్‌ 7.5-1-32-2, ముస్తాఫిజుర్‌ 8-0-50-3, నజుమ్‌ అహ్మద్‌ 10-0-50-0, షకీబ్‌ 10-2-43-1, మెహిదీ హసన్‌ 9-1-50-2, హసన్‌ మిరాజ్‌ 5-0-29-1.