
హైదరాబాద్ : బెంగళూర్‌లో జరిగిన వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ కాంగ్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూపీసీ)లో తెలంగాణ పవర్‌లిఫ్టర్లు సత్తా చాటారు. అండర్-90 డెడ్‌లిఫ్ట్‌లో 105 కేజీలు ఎత్తిన డి. శిల్ప గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే విభాగంలో 100 కేజీలు ఎత్తిన ఇందూ సిల్వర్ మెడల్ గెల్చుకుంది. ఇతర విభాగాల్లో తర్శియ, శృతి గోల్డ్ మెడల్స్ కొట్టగా.. సౌమ్య రజత పతకం గెల్చుకుంది. డబ్ల్యూపీసీ కర్ణాటక అధ్యక్షుడు మహ్మద్ అజమత్ విజేతలకు బహుమతులు అందజేశారు.