మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అదరగొట్టాడు. ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 51 పరుగులిచ్చిన షమీ.. 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను షమీ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఈ క్రమంలో షమీ పలు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇప్పటి వరకు షమీ ఆసీస్‌పై 37 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(36) రికార్డును షమీ బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(45) తొలి స్థానంలో ఉన్నాడు. షమీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పేరిట ఉండేది. జడ్డూ, కుల్దీప్ ఇద్దరూ సంయుక్తంగా ఆసీస్‌పై 24 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరి రికార్డును షమీ బ్రేక్ చేశాడు.










