Aug 21,2023 09:27

చుక్కల లోకం వెళ్ళొద్దామా
చక్కని జాబిలి చూసొద్దామా
అంతుచిక్కని రహస్యాలనూ,
వింత దృశ్యాలు తిలకిద్దామా?

మేఘాల్లో దాక్కుందామా
వెన్నెల వానలో తడిచేద్దామా
చుక్కల మెరుపులతో జత కట్టి
మిక్కిలి మోదం పొందెద్దామా?

చంద్రుని ఒడిలో పవళిద్దామా
ఇంద్రుని వాహనం ఎక్కేద్దామా
మబ్బుల తేరు లాగేద్దామా
దబ్బున ఊరు చేరేద్దామా?
 

- గద్వాల సోమన్న,
99664 14580