Sep 15,2023 22:32

కొలంబో: నామమాత్రపు చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ భారత బౌలర్ల ధాటికి ఓ దశలో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌(80), తౌహిద్‌ హ్రిదోరు(54) రాణించడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. చివర్లో నసుమ్‌ అహ్మద్‌(44), మెహిది హసన్‌(29నాటౌట్‌) మెరుపులు మెరిపించి, బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌ చేసేందుకు తోడ్పడ్డారు. 34.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులుగా ఉన్న బంగ్లా స్కోర్‌.. ఆ తర్వాత 15.5 ఓవర్లలో ఏకంగా 104 పరుగులు జోడించి, 265 పరుగులు చేసింది. శార్దూల్‌కు మూడు, ప్రసిధ్‌ కృష్ణ, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీసారు.
జడేజా ఏ 200వికెట్లు
టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 200 వికెట్ల తీసిన క్లబ్‌లో చేరాడు. బంగ్లాదేశ్‌తో సూపర్‌ా4 మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. రవీంద్ర జడేజా కేవలం 175 వన్డేల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. ఎడమచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్‌ అయిన జడేజా బంగ్లాదేశ్‌పై 10 ఓవర్లలో 53పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. 34ఏళ్ల జడేజా ఏడుసార్లు నాలుగేసి వికెట్లు తీయగా.. ఒకసారి ఐదు వికెట్లను కూల్చాడు. వెస్టిండీస్‌పై 2013లో ఓవల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు(5/36)ను నమోదు చేశాడు. వన్డేల్లో జడేజా తొలి వికెట్‌ను 2009 వడోదరలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో రికీ పాంటింగ్‌ను ఔట్‌చేసి తన వికెట్ల వేటను మొదలుపెట్టాడు. 200కు పైగా వికెట్లు తీసిన భారత బౌలర్లలో జడేజా ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. సౌరాష్ట్రకు చెందిన జడేజా మూడు ఫార్మాట్‌లలో కలిసి ఇప్పటివరకు 275వికెట్లను పడగొట్టాడు.
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (బి)శార్దూల్‌ 13, లింటన్‌ దాస్‌ (బి)షమీ 0, అనముల్‌ (సి)రాహుల్‌ (బి)శార్దూల్‌ 4, షకీబ్‌ (బి)శార్దూల్‌ 80, మెహిదీ హసన్‌ (సి)రోహిత్‌ (బి)అక్షర్‌ 13, తౌహిద్‌ హందాయ్ (సి)తిలక్‌ వర్మ (బి)షమీ 54, షమీమ్‌ (ఎల్‌బి)జడేజా 1, నసుమ్‌ అహ్మద్‌ (బి)ప్రసిద్‌ 44, మెహిదీ హసన్‌ (నాటౌట్‌) 29, తంజిమ్‌ (నాటౌట్‌) 14, (అదనం 13. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 265పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/15, 3/28, 4/59, 5/160, 6/161, 7/193, 8/238
బౌలింగ్‌: షమీ 8-1-32-2, శార్దూల్‌ 10-0-65-3, ప్రసిధ్‌ 9-0-43-1, అక్షర్‌ 9-0-47-1, తిలక్‌ వర్మ 4-0-21-0, జడేజా 10-1-53-1.