Oct 16,2023 10:01

ముంబయి : బౌలింగ్‌ కార్ఖానా పాకిస్థాన్‌ క్రికెట్‌ !. ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌ నుంచీ ఇప్పటివరకు పాక్‌ క్రికెట్‌లో ఆ సంస్కృతి కొనసాగుతుంది. ప్రస్తుత పాక్‌ జట్టులో ఆ జట్టు పేస్‌ సారథి షహీన్‌ షా అఫ్రిది. భారత్‌ సహా ఏ అగ్ర జట్టుతో తలపడినా.. షహీన్‌ షా అఫ్రిది ప్రస్తావన ఉంటుంది. భారత బ్యాటర్లకు లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్లను ఎదుర్కొనే బలహీనత ఉంది. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిది ఈ బలహీనతను కొన్ని సందర్భాల్లో సొమ్ముచేసుకున్నాడు. అయితే, షహీన్‌ అఫ్రిది మంచి పేసరే కానీ దిగ్గజాలతో పోల్చదగిన స్థాయి అతడికి కాదని భారత మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.