న్యూఢిల్లీ : వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్లు పతనాన్ని చవి చూశాయి. సోమవారం అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్ 826 పాయింట్లు పతనమై 64,572కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 261 పాయింట్లు కోల్పోయి 19,282కు క్షీణించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 4.18 శాతం చొప్పున నష్టపోయాయి. అక్టోబర్ 24న మంగళవారం దసరా పండగ సందర్బంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.